Tasty Teja elimination: టేస్టీ తేజ ఎలిమినేషన్.. బుగ్గ మీద కిస్ ఇచ్చిన రోహిణి!
on Dec 1, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో హౌస్ లో ఎవరి పర్ఫామెన్స్ ఏంటో చెప్తూ దమ్ము, దుమ్ముదుమ్మయిపోయే ప్లేయర్ ఎవరంటూ అడిగాడు నాగార్జున.
హౌస్ లో బ్లాక్ టికెట్, గోల్డెన్ టికెట్ ఇవ్వమని చెప్పగా .. నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్ కి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. టేస్టీ తేజకి బ్లాక్ టికెట్ ఇచ్చారు. అవినాష్ ఇప్పటికే ఫైనలిస్ట్ కావడంతో నామినేషన్స్‌లో ఉన్నా ఏం సంబంధం లేదని ముందే నాగార్జున క్లారిటీ ఇచ్చారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్నవాళ్లంతా నిల్చోండి అంటూ నాగార్జున చెప్పగానే అవినాష్-రోహిణి తప్ప మిగిలిన వాళ్లంతా నిల్చున్నారు. ఇక వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారని చెప్పేందుకు స్టేజ్ మీద ఉన్న ప్రింటర్ బటన్ క్లిక్ చేశారు నాగార్జున. అందులో నుంచి టేస్టీ తేజ ఫొటో వచ్చింది. దీంతో తేజ యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ నాగార్జున అనౌన్స్ చేశాడు.
తేజ ఎలిమినేట్ అవ్వగానే కాస్త ఫీల్ అయ్యాడు. కానీ వెంటనే సార్ ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తా అంటూ నాగార్జునకి చెప్పి హౌస్‌మేట్స్ అందరికీ బైబై చెప్పాడు. నేను సీజన్ 7లో ఫ్యామిలీ వీక్‌లో మా అమ్మని తీసుకురాలేకపోయా.. కానీ ఈ సీజన్‌లో అది నెరవేర్చా అందుకు చాలా హ్యాపీగా ఉంది.. ఆ తర్వాత మరో రెండు వారాలు ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఆస్వాదించాను. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు.. చాలా హ్యాపీగా హౌస్ నుంచి వెళ్తున్నా అంటూ తేజ అన్నాడు.
ఇక తేజ ఎలిమినేట్ కావడంతో అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోహిణి కూడా బాధపడంది. మిగిలిన వాళ్లందరికీ కూడా హగ్గు ఇచ్చి తేజ గార్డెన్ ఏరియాకి వచ్చేశాడు. ఇక గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత టేస్టీ తేజకి రోహిణి బుగ్గ మీద ఓ ముద్దు పెట్టింది. కిస్ ఇచ్చినప్పుడు తేజ తెగ మురిసిపోయాడు. అలానే అవినాష్ కూడా ఓ కిస్ ఇచ్చి బైబై చెప్పేశాడు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు కూడా తేజకి గుడ్ బై చెప్పారు. ఇక వెళ్లేమందు అందరూ బాగా ఆడాలని.. అందరినీ ఫినాలేకి వచ్చి చూస్తానంటూ తేజ చెప్పుకొచ్చాడు. మరోసారి సీజన్-8కి అవకాశమిచ్చి ఇంతవరకూ తీసుకొచ్చిన ఆడియన్స్‌కి కూడా థ్యాంక్స్ చెప్పాడు.
Also Read